Spread The Love

సినిమా డెస్క్, నేటిదర్శిని:
తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించిన నటి కీర్తి సురేష్ వివాహం ఘనంగా జరిగింది. గోవాలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కీర్తి సురేష్ ప్రేమించిన వ్యక్తి ఆంటోనీ, ఆమె మెడలో తాళి కట్టి జీవిత భాగస్వామిగా మారారు.
గోవాలోని ప్రత్యేకంగా డిజైన్ చేసిన రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. సంప్రదాయ విధానంలో నిర్వహించిన ఈ వేడుకలో కీర్తి పట్టు చీరలో, ఆంటోనీ క్లాసిక్ డిజైనర్ డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ పెళ్లి గురించి పుకార్లు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నా, ఆమె కుటుంబం పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచింది. కానీ పెళ్లి జరిగిన తర్వాత అభిమానుల కోసం అధికారిక ప్రకటన చేశారు. ఈ వేడుకకు సినీ రంగ ప్రముఖులు హాజరుకాలేదు, కానీ వారందరూ నూతన వధూ వరులను శుభాకాంక్షలు తెలుపుతున్నారు.