Spread The Love

‘పేట’లో ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తున్నాం

నారాయణపేట మార్చి31 (నేటి దర్శిని):
కె.నాగరాణి రచన, దర్శకత్వంలో త్వరలో యూట్యూబ్ ద్వారా తెరకెక్కనున్న శివ కాల భైరవ ఆధ్యాత్మిక పాటకు సంబంధించిన పోస్టర్ ను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సోమవారం నారాయణపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కే.నాగరాణి ఆధ్వర్యంలో శివ కాల భైరవ ఆధ్యాత్మిక పాటను ఇటీవల నారాయణపేటలో చిత్రీకరించారని తెలిపారు. ఈ పాట ప్రజల మన్ననలు పొందడంతో పాటు పాటను రచించి దర్శకత్వం వహించిన కె.నాగరాణి బృందానికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. నారాయణపేటలో ఉన్న కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు తమవంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో ఫౌండేషన్ సభ్యులు పోలీస్ పటేల్ మధుసూదన్ రెడ్డి,  శివరాజ్, రుద్రారెడ్డి, ఎం.సంతోష్, హనుమంతు, నరసింహనాయుడు, వై.సంతోష్, వెంకటప్ప, శివ కాల భైరవ పాట బృందం పాల్గొన్నారు.