Coal Mines: బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు రెడీ..

DCM-Mallu-Bhatti-Vikramarka

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ,జనవరి 24 (నేటి దర్శిని): సింగరేణి సంస్థపై కొన్ని రోజులుగా వస్తున్నవి కట్టుక థలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొట్టి పారేశారు. రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని, పెట్టుబడులు, కట్టుకథలు, పిట్టకథల విష పలుకులతో తప్పుడు ప్రచా రానికి తెరలేపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఫైరయ్యారు. సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటున్నారని, దానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఇవాళ ఆయన హైద రాబాద్లోని ప్రజా భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారా వుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓ మీడియా సంస్థ ఏ రాబందులు, ఏ గద్దలు. ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమే ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.

నిజానిజాలు బయటకు రావాలి..

ఈ బొగ్గు గనుల టెండర్ల విషయంలో నిజానిజాలు బయటకు రావాలని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ ఇష్యూపై పత్రికలు, నాయకులే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొ చ్చినట్టుగా మాట్లాడుతున్నారని మందపడ్డారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు కూడా ఇస్తా మన్నారు. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు రూపం బయటపడాలన్నారు. 2018లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారుచేసి పంపించిందన్నారు. సైట్ విజిట్ తప్పనిసరి అని కోల్ ఇండియానే పెట్టిందని, హరీశ్రావు లేఖ రాయడం మంచిదే అయ్యిందన్నారు. కిషన్రెడ్డి విచారణ చేస్తామనడం కూడా మంచిదేనని, అందరి నిర్ణయాలను తాము స్వాగతిస్తాన్నారు. 2021లో సెంట్రల్ మైనింగ్ కూడా సైట్ విజిట్ తప్పని సరి అని చెప్పిందని, టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదని గుర్తు చేశారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచిం దని, అయితే సైట్ విజిట్ తాను చేసినట్టు తప్పుడు కథనాన్ని ప్రచురించారని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఎన్ఎండీసీ కూడా చెప్పిందని స్పష్టం చేశారు.