ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
HomeసినిమాలుRam Charan: మెగా కుటుంబంలో కవలల ఆనందం…

Ram Charan: మెగా కుటుంబంలో కవలల ఆనందం…

📰 Generate e-Paper Clip

నేటి దర్శిని (వెబ్ న్యూస్): మెగా కుటుంబంలో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్–ఉపాసన కామినేని దంపతులకు కవలలు జన్మించారు. ఉపాసన ఓ మగ, ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కవలల జననంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ శుభవార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటూ శుభాకాంక్షలు వెల్లజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular