Spread The Love

నేరాల అదుపుకు నిఘా నేత్రాల దోహదం: ఎస్పీ యోగేష్ గౌతమ్

నారాయణపేట,డిసెంబర్12 (నేటిదర్శిని):
నేరాల అదుపుకు నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ తాయని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.6 లక్షల వ్యయంతో నారాయణపేట పట్టణంలో ఏర్పాటుచేసిన 20 సీసీ కెమెరాలను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అడిగిన వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డిని ఎస్పీ యోగేష్ గౌతమ్ అభినందించారు.

సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఎస్పీ

అంతకుముందు ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డిని ఎస్పీ యోగేష్ గౌతమ్ శాలువతో సన్మానించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ ను ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా డీఎస్పీ ఎన్.లింగయ్య, నారాయణపేట సీఐ బి.శివశంకర్, ఎస్ఐ ఎ.వెంకటేశ్వర్లు తదితరులను ఫౌండేషన్ చైర్మన్, నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పేదలను ఆదుకునేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ సురేష్ కుమార్, అధ్యాపకులు మణిమాల, ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, బాలాజీ, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, ఉమేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, సంతోష్, అభిషేక్ రెడ్డి, రమణ, అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.