ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
HomeతెలంగాణArrest: త్రిపురారంలో పట్టుబడ్డ గంజాయి ముఠా

Arrest: త్రిపురారంలో పట్టుబడ్డ గంజాయి ముఠా

📰 Generate e-Paper Clip

– 1.60 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, రూ.1100 స్వాధీనం

– పల్నాడు జిల్లా నుంచి అక్రమ రవాణా

– గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరిక

నల్గొండ జిల్లా, నవంబర్ 13 (నేటి దర్శిని): నల్గొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయం చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి మొత్తం 1.60 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు, ఈ నిందితులు పల్నాడు జిల్లా నుంచి అక్రమంగా గంజాయిని త్రిపురారానికి తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి నలుగురిని పట్టుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయం మరియు వినియోగం సమాజాన్ని దారి తప్పించే నేరం అని హెచ్చరించారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ వ్యాపారాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular