ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

👉 ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

👉 17మంది దుర్మరణం!

రంగా రెడ్డి (నేటి దర్శిని వెబ్ న్యూస్):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 17మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.

బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసు సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular