🔴 నూతన బోరు కోసం రూ.15వేల చెక్కు అందజేత
నారాయణపేట జూలై13 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది. నూతన బోరు కొనుగోలు చేయడానికి గాను రూ.15వేల చెక్కును ఆదివారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాపేట గ్రామంలో తాగునీటి బోరు చెడిపోయిందని ఇటీవల గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. నూతన బోరు కొనుగోలు కోసం రూ.15 వేలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.
రాజ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు: అంజలయ్య గౌడ్
ముస్తాపేట గ్రామంలో ఉన్న తాగునీటి బోరు ఇటీవల చెడిపోయిందని, నూతన బోరు కొనుగోలు కోసం సహకరించాలని కోరుతూ ఇటీవల భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే ప్రజల దాహార్తిని తీర్చడానికి, నూతన బోరు కోసం రూ.15వేలను అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిద్దప్ప, లాలప్ప, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, వై.సంతోష్, శివరాజ్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నర్సింహ, నాగురావు, అశోక్, కృష్ణ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.