గుర్రంపోడు ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా కూనూరు సైదిరెడ్డి జన్మదిన వేడుకలు
పాల్గొన్న తహసిల్దార్ శ్రీనివాస్, నాయబ్ తహసిల్దార్ పరిదుద్దీన్


గుర్రంపోడు, జూలై08 (నేటి దర్శిని): గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ మీ సేవ నిర్వాహకులు కూనూరు సైదిరెడ్డి జన్మదిన వేడుకలు ఈ రోజు మండల తహసిల్దార్ కార్యాలయంలో అత్యంత హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పీ. శ్రీనివాస్ పాల్గొని కూనూరు సైదిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా నాయబ్ తహసిల్దార్ ఫరీదుద్దీన్ కూడా ఈ వేడుకలో పాల్గొని సైది రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా కూనూరు సైదిరెడ్డి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది వినియోగించుకునేందుకు 20 ప్లాస్టిక్ చైర్లు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం ఈ మంచి పనిని ఆయన చేపట్టిన విధానం అందరి మెప్పును పొందింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఆ.ఐ. నజీర్, రామకృష్ణ, వెంకట కృష్ణ, సందీప్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సైదిరెడ్డికి అభినందనలు తెలిపారు.



