Spread The Love

3న ‘పేట’లో మెగా జాబ్ మేళా..

జాబ్ మేళా కరపత్రం ఆవిష్కరణ..

నారాయణపేట ఏప్రిల్27 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ నడుం బిగించిందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.గార్డెన్స్ లో మే 3వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం నారాయణపేటలో రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో చదువులు పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 50 ప్రముఖ ఎం.ఎన్.సీ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ ఆవిష్కరణలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గోపాల్ గౌడ్, హనుమంతు, వై.సంతోష్, శివరాజ్, ఎం.సంతోష్, నరేష్ గౌడ్, కృష్ణ, చామకూర నగేష్, వంశీరెడ్డి,  గోపాల్, అశోక్, వెంకటరావు తదితరులు ఉన్నారు.