దేవి షి ఝాన్సీని సత్కరించిన పాఠశాల నిర్వాహకులు
హైదరాబాద్ మే07 (నేటి దర్శిని):
ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చంపాపేటలోని ది కౌల్డ్రాన్ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని గుమ్మల్ల దేవేషి ఝాన్సీ 587/600 మార్పులను సాధించింది. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థిని గుమ్మల్ల దేవేషి ఝాన్సీని పాఠశాల నిర్వాహకులు పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే పాఠాలను బోధించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
