Spread The Love

నారాయణపేట ఏప్రిల్12 (నేటి దర్శిని):
గ్రూపు-1 పరీక్షల్లో నారాయణపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సల్ల శ్రీనివాస్-వసుంధరల కుమార్తె సల్ల వీణ ఇటీవల విడుదలైన గ్రూపు-1 ఫలితాల్లో 485.5 మార్కులను సాధించారు. విషయాన్ని తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి… ఫౌండేషన్ సభ్యులతో కలిసి శనివారం వారి నివాసానికి తరలివెళ్లి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, హన్మంతు, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎం.సంతోష్, గోపాల్ గౌడ్, అశోక్, వై.సంతోష్, నర్సింహనాయుడు, చల్లా వెంకటేష్, గోపాల్, శివరాజ్, వంశీరెడ్డి, వీణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.