ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణశివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను ఆవిష్కరించిన రాజ్ కుమార్ రెడ్డి

శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను ఆవిష్కరించిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నారాయణపేట ఏప్రిల్12 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కె.నాగరాణి రచించి, దర్శకత్వం వహించిన శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి లాంఛనంగా పాటను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చక్కని ఆధ్యాత్మిక కథతో రూపుదిద్దుకున్న శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను యూట్యూబ్ ద్వారా ప్రతిఒక్కరూ చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. నారాయణపేటకు చెందిన పేద కళాకారుని కె.నాగరాణి రచించి, దర్శకత్వం వహించిన శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటకు భీష్మరాజ్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పేద కళాకారులను ప్రోత్సహించేందుకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, హన్మంతు, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎం.సంతోష్, గోపాల్ గౌడ్, అశోక్, వై.సంతోష్, నర్సింహనాయుడు, చల్లా వెంకటేష్, గోపాల్, శివరాజ్, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular