గిరిజన సాంప్రదాయ పద్ధతిలో రాజ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం
గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్న మహిళలు


నారాయణపేట ఫిబ్రవరి 22 (నేటిదర్శిని):
వందర్ గుట్ట తండలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం వందర్ గుట్ట తండను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం సందర్శించి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో రాజ్ కుమార్ రెడ్డికి, ఫౌండేషన్ సభ్యులకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి నోచుకోలేదని, సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి సహకరించాలని వందర్ గుట్ట తండకు చెందిన పెద్దలు తనను కలిసి విన్నవించారని తెలిపారు. తండ పెద్దల విజ్ఞప్తి మేరకు సందర్శించి దేవాలయ నిర్మాణానికి తనవంతు పాటుపడతానని హామీనిచ్చారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తానని రాజ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో తండ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులు, యువకులు, గ్రామ పెద్దలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ రాజ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు శాలువలతో రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వందర్ గుట్ట తండకు చెందిన మాజీ ఎంపీటీసి లాలునాయక్, మాజీ ఉప సర్పంచ్ వచ్యానాయక్, బాలునాయక్, గణేష్ నాయక్, సురేష్ నాయక్, శ్రీను నాయక్, నర్సింహ, నీలారామ్, లక్ష్మి, వినోద్, ఫౌండేషన్ సభ్యులు గోపాల్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, జె.నర్సింహనాయుడు, ఎం.సంతోష్, అశోక్, మేంగ్జీ నందుకుమార్, అధిక సంఖ్యలో గిరిజన మహిళలు, యువతులు, యువకులు, తండ పెద్దలు పాల్గొన్నారు.