బైరంకొండలో ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు

నారాయణపేట డిసెంబర్07 (నేటిదర్శిని):
నారాయణపేట జిల్లా బైరంకొండ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మహోత్సవాలను పురస్కరించుకొని భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవాలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డికి డప్పు వాయిద్యాలతో నిర్వాహకులు స్వాగతం పలికారు. దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, బొడ్రాయి పండుగలను వైభవంగా నిర్వహించారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని దేవాలయ నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, గోపాల్, కృష్ణ, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
