ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- ఎంపిటిసి, జడ్పీటిసి నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం
- నామినేషన్ కేంద్రాల వద్ద నిభందనలు పాటించాలి
- నిరంతరంగా తనిఖీలు ఉంటాయి
- ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి.
- నిషేధిత వస్తువుల రవాణా పై నిఘా ఉంచాం.
- సోషల్ మీడియా నందు అసత్య ప్రచారాలు చేసిన ఇతర వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు
- జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్.
మహబూబ్ నగర్, అక్టోబర్09 (నేటి దర్శిని):
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, జిల్లాలో ఈ రోజు నుండి నుండి జిల్లాలోని 16 మండలాల్లో ఎంపిటిసి, జడ్పీటిసి స్థానాలకు జరగనున్న నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట నిఘా ఉంచాం అని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది స్థానిక SI లతో పాటు DSP లు, CI లు పర్యవేక్షణ చేస్తున్నారు. 100 మీటర్ల పరిది నిభందనలు ఉంటాయి, బారికేడ్స్ ఏర్పాటు చేశాము, ఎన్నికల నిభందనలు, అధికారుల సూచనలు పాటించాలి. నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, నియమనిబంధనల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తాము. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు, పౌరులు రాజకీయ పార్టీలు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి గారు అన్నారు శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుంది అని తెలిపారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాము రహదారుల వెంట హోటల్స్ డాబాల్లో మద్యం అమ్మవద్దు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలాగా జరగాలని అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత గా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. జిల్లాలోకి అక్రమ రవాణా జరగకుండా అక్రమ మద్యం ఇతర వస్తువులు రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నియమావళి నిభందనలు ప్రకారం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడుతున్నాం, రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ కొనసాగుతుంది, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100 కు, పోలీస్ కంట్రోల్ రూం 8712659360 కి సమాచారం ఇవ్వాలి. గత ఎన్నికలలో కేసుల్లో ఉన్న నెరస్థులను ముందస్తుగా బైండోవర్ చేయడం, సమస్యలు సృస్థించే ట్రబుల్ మాంగర్స్ ను, రౌడీలను, కేడిలను, సస్పెక్ట్ లను ముందస్తు బైండోవర్ చేస్తాం. జిల్లాలో ఉన్న ఆయుధాలను ముందస్తుగా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సృష్టించడం లాంటివి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంభందిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్ లపై చట్టపరమైన చర్యలు తప్పవు అని ఎస్పీ గారు హెచ్చరించారు.
