Spread The Love

బిజినెస్ న్యూస్ నేటి దర్శిని: మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పెట్రోల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువ ధరకు ముఖేష్ అంబానీ జియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుంది.

రేంజ్

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన మోటారుతో వస్తుంది. దీని లిథియం-అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుండి 100 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ధర

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 నుండి రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఇంత తక్కువ ధరకు మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం లేదు.  ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఆన్‌లైన్ బుకింగ్

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నంబర్ ఇస్తారు. దాన్ని తీసుకొని దగ్గర్లోని జియో స్టోర్ నుండి స్కూటర్‌ను డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాని డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారుల చేతికి అందవచ్చని తెలుస్తోంది.