నారాయణపేట డిసెంబర్ 4 (నేటిదర్శిని):
ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి 18 మహా పడిపూజ మహోత్సవం అయ్యప్ప స్వాముల జయజయ ద్వానాల మధ్య, భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండువగా బుధవారం జరిగింది. దేవేందర్ గౌడ్ గురుస్వామి చేపట్టిన అయ్యప్ప స్వామి 18వ పడిపూజా మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లంపల్లి గ్రామంలో కనివిని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి మహా పడిపూజను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, గోపాల్, కృష్ణ, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కొల్లంపల్లి గ్రామంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
