Spread The Love

👉  అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు

ఎల్.బీ.నగర్,ఆగస్టు08 (నేటి దర్శిని):
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ పార్వతిదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాలయానికి తెల్లవారుజామున నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపకులు వంగ మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తలు, సిబ్బంది శ్రీనివాస్, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.