◻️ పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు
◻️ మొక్కలు నాటిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం
నారాయణపేట జూలై30 (నేటి దర్శిని):
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణ కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న కాశీనాథేశ్వర కాలనీలో మంగళవారం కాలనీవాసులు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే తప్పనిసరిగా అందరూ మొక్కలను నాటాలని కోరారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు తమ ఫౌండేషన్ ద్వారా మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అదేవిధంగా ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులతో మొక్కలను నాటించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పమ్న, మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, చల్లా వెంకటేష్, నర్సింహనాయుడు, శివరాజ్, వై.సంతోష్, మన్నె గోపాల్, నర్సింహ, శ్రీనివాస్, ఎం.సంతోష్, వెంకటరావు, నాగురావు, రాజప్ప గౌడ్, బస్వరాజ్, విశాక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


