మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

IMG-20250815-WA0038.jpg

నారాయణపేటలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సౌండ్ సిస్టం కోసం రూ.50వేల అందజేత

నారాయణపేట,ఆగస్టు15 (నేటి దర్శిని):
దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులు చూపిన మార్గంలో నేటి యువతరం పయనిస్తూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న కాశీనాధేశ్వర కాలనీలో గల భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం త్రివర్ణ పతాకాన్ని ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఎగురవేసి… జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతిఒక్కరికి అందేలా అందరూ పాటుపడాలని కోరారు. అనంతరం కాలనీవాసులకు, ఫౌండేషన్ సభ్యులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సల్ల వెంకటేష్, శివరాజ్, వెంకటరావు, నర్సింహనాయుడు, అశోక్, ఎం.సంతోష్, నందుకుమార్, నర్సింహ, శ్రీనివాస్, జేకే.అనిల్, నాగురావు, చామకూర నగేష్, రాంకోటి తదితరులు పాల్గొన్నారు.

బీసీ బాలువ హాస్టల్ లో…

నారాయణపేట శాతవాహన కాలనీలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఫౌండేషన్ సభ్యులతో కలిసి చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ మంజుల, నారాయణపేట జిల్లా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు మడివాల కృష్ణ, విద్యార్థులు శివ, సాయి, వెంకటేష్, ప్రవీణ్, ఫౌండేషన్ సభ్యులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

బాలికల గురుకుల పాఠశాలకు రూ.50 వేల అందజేత

నారాయణపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో సౌండ్ సిస్టం కోసం రూ.50 వేలను రాజ్ కుమార్ రెడ్డి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యామిని, ఉపాధ్యాయులు భగవాన్, లక్ష్మీనారాయణ, అంజప్ప, ఫౌండేషన్ సభ్యులు, అధిక సంఖ్యలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.