Spread The Love

నారాయణపేట జూలై25 (నేటి దర్శిని):
పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బోరు నీటి పనులకు శ్రావణమాసం మొదటి రోజు అయిన శుక్రవారం రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, కాలనీ పెద్దలతో కలిసి పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరు నీటి ఏర్పాటు కోసం అడిగిన వెంటనే భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి బోరు నీటి పనులకు శంకుస్థాపన చేసి శుక్రవారం పనులను ప్రారంభించారని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో బోరు నీటి ఏర్పాటుతో కాలనీలో నీటి సమస్య తీరుతుందని తెలిపారు. అందుకు సహకరించిన రాజ్ కుమార్ రెడ్డికి, ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

బోరు ఏర్పాటుతో తీరనున్న నీటి సమస్య: రాజ్ కుమార్ రెడ్డి

పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో బోరు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో నీటి సమస్య తీరుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో బోరును ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని కాలనీవాసులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు శ్రీకాంత్, గడ్డం సిద్దు, కనికి శ్యామ్, ఎల్లప్ప, క్యాతనపల్లి శివ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, పుర్ర బాలప్ప, లింగప్ప, ఫరిద్, జమీర్, చాంద్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, చల్లా వెంకటేష్, శ్రీనివాస్, ఎం.సంతోష్, నర్సింహనాయుడు, అశోక్, నందుకుమార్,  నర్సింహ, చామకూర నగేష్, రాజప్పగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.