Spread The Love

త్వరలోనే అందుబాటులోకి కల్యాణ మండపం: రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులను సత్కరించిన దేవాలయ నిర్వాహకులు

నారాయణపేట జూలై25 (నేటి దర్శిని):
భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కల్యాణ మండప నిర్మాణానికి దేవాలయ నిర్వాహకులు, గ్రామస్తులు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వీరభద్రేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండపం లేక ఎంతో మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి సహకరించాలని గతంలో దేవాలయ నిర్వాహకులు తమను కోరారని, వారి విజ్ఞప్తి మేరకు కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండపాన్ని నిర్మించి భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. పెళ్లిల సీజన్ లో ఇక్కడ భక్తులు వివాహాలు జరుపుకుంటారని, అలాంటి వారికి ఈ కల్యాణ మండపం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డిని, ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్వాహకులు, పురోహితులు శాలువలతో సత్కరించి స్వామి వారి ఫోటోను బహూకరించారు. అంతకుముందు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నారాయణ, ఉపాధ్యక్షులు బసంత్ రాజ్ పటేల్, కోడ్లీ శరణప్ప, బసిరెడ్డి, మోహన్ రెడ్డి, గంగాధర్, పురోహితులు శివకుమార్, శరణయ్య, గణేష్, చెన్ను, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, రాఘవేందర్ గౌడ్, చల్లా వెంకటేష్, నర్సింహనాయుడు, ఎం‌.సంతోష్, నందుకుమార్, వై.సంతోష్, నర్సింహ, శ్రీనివాస్, అశోక్, ప్రవీణ్, విజయ్, రాజు, భక్తులు ధానప్ప, రాములు, వీరేష్, లాలప్ప, వెంకటయ్య, వెంకోబా, సిబ్బంది పాల్గొన్నారు.