ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట జూన్11 (నేటి దర్శిని):
డీసీడీ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమాన్ని బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ను రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ దేవ మాస్టర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ ప్రజల ఆదరణ పొంది మంచి పేరు, ప్రతిష్టలు సాధించాలని సూచించారు. అనంతరం పలువురు చిన్నారులు, జబర్దస్త్ టీమ్ సభ్యులు వివిధ రకాల డాన్సులు, ప్రదర్శనలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని నిర్వాహకులు శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ రవి, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ దేవ మాస్టర్, మాస్టర్లు చిన్న, శ్రీనివాస్, కెమెరామెన్, నిర్మాత అంబాజీ, జబర్దస్త్ టీమ్ అదుర్స్ ఆనంద్, నాగతేజ, లండన్ రమేష్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంతు ముదిరాజ్, రాఘవేందర్ గౌడ్, జె.కె.అనిల్, శివరాజ్, నర్సింహనాయుడు, శ్రీనివాస్, కృష్ణయాదవ్, రాజు, డాన్స్ మాస్టర్లు, డాన్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.