
ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు
నారాయణపేట జూన్02 (నేటి దర్శిని):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో వందలాదిమంది అమరులయ్యారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు కంకణ బద్ధులై పని చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో సోమవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను రాజ్ కుమార్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ప్రతిఒక్కరూ తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, ప్రజలకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు సరబ్ నాగరాజు, రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, మోహన్, రాఘవేందర్ గౌడ్, రంగయ్య గౌడ్, రాజప్పగౌడ్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహనాయుడు, రుద్రారెడ్డి, ఎం.సంతోష్, శివరాజ్, వై.సంతోష్, మన్నె గోపాల్, నందుకుమార్, నాగురావు, అశోక్, శ్రీనివాస్, వెంకటరావు, నర్సింహులు, హరికృష్ణ ప్రభూజీ, స్పోర్ట్స్ అధికారి వెంకటేష్ శెట్టి, మాస్టర్లు తిమ్మప్ప, అశోక్, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
