ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి రాజ్ కుమార్ రెడ్డి

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోత్లాబాద్ గ్రామంలో ఘనంగా శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్ర వీధి నాటకం

హాజరైన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులు

కోయిలకొండ జూన్05 (నేటి దర్శిని):
ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామంలో శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్ర వీధి నాటకాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ వీధి నాటకానికి రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో, గ్రామస్తులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రను గ్రామీణ యాస, భాషలో వీధి నాటకం ద్వారా వివరించడం అభినందనీయమని అన్నారు. శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్రను కళాకారులు క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతకుముందు వీధి నాటకానికి సంబంధించిన కళాకారులను, సాంకేతిక నిపుణులను రాజ్ కుమార్ రెడ్డి శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని, ఫౌండేషన్ సభ్యులను నిర్వాహకులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీధి నాటక ఉపాధ్యాయులు కతల్ అహ్మద్, హోర్మోనిస్టులు బి.మాధవులు, రాజన్న, నారాయణ, లక్ష్మన్న, ఖాజన్న, అంజిలయ్య, సందుల అంజిలయ్య, రాజు, వెంకటయ్య, కళాకారులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, నర్సింహనాయుడు, హన్మంతు ముదిరాజ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular