Spread The Love

ఆశ్రమాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న రాజ్ కుమార్ రెడ్డి

దశలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు

హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు, గ్రామస్థులు

దామరగిద్ద మే17 (నేటి దర్శిని):
నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమంలో అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి ఆశ్రమంలో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు గాను కల్యాణ మండపానికి షెడ్డు నిర్మాణం, వంటశాల కోసం షెడ్డు నిర్మాణాలు చేపట్టాలని ఆశ్రమ నిర్వాహకులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆయా పనులను పూర్తి చేసేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని హామీనిచ్చారు. ఆశ్రమంలో మిగిలిపోయిన మిగతా పనులను దశలవారీగా చర్యలు చేపడతానని అన్నారు.

కళాకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు

అదే విధంగా గ్రామంలో పురాణాలు, నాటకాలను బోధించే కళాకారులకు అవసరమైన పనిముట్లను కూడా త్వరలోనే అందజేస్తామని రాజ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామస్థులు రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులను ఆశ్రమ నిర్వాహకులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, శివరాజ్, అశోక్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నందుకుమార్, గోపాల్ రెడ్డి, కృష్ణయాదవ్, జేవీ.రావు, వంశీరెడ్డి, నిర్వాహకులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు, కళాకారుల బృందం సభ్యులు, చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు.