Spread The Love

ధన్వాడలో అంబేద్కర్ కు నివాళులర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట ఏప్రిల్14 (నేటి దర్శిని):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, అధిక సంఖ్యలో యువకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.