Spread The Love

న్యూస్ డెస్క్ మార్చి31 (నేటి దర్శిని):
నల్లగొండ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం తెరాటి గూడెంలో సోమవారం మధ్యాహ్నం మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం, మద్యానికి బానిసైన భర్తను భార్య అరుణ (35) ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చే భర్తపై ఆమె కోపం వ్యక్తం చేయగా, మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా చంపాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.