ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపండుగలు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయి: రాజ్ కుమార్ రెడ్డి

పండుగలు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయి: రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నారాయణపేట జామా మసీదు వద్ద ఇఫ్తార్ విందు

నారాయణపేట మార్చి27 (నేటి దర్శిని):
పండుగలు అన్నివర్గాల ప్రజల్లో  సోదరభావాన్ని నింపుతాయని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో భాగంగా నారాయణపేట జామా మసీదు వద్ద గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి  హాజరై ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ముందస్తుగా ఈద్ ముబారక్ చెప్పారు. అంతకుముందు నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి తదితరులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగలను అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహ్మద్ తహి చాంద్, అమీరుద్దీన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందు నామాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యయాదవ్, ముస్లిం సోదరులు మహ్మద్ షాబుద్దీన్, షరీఫ్ ఖురేషి, సయ్యద్ షా గయాసుద్దీన్ ఖాద్రి, సయ్యద్ షా మోసిన్, అబ్దుల్ అజీజ్, మహ్మద్ యూసుఫ్ చాంద్, మహ్మద్ అఖిల్ చాంద్, మహ్మద్ గౌసి తాజ్, మహ్మద్ ఉస్మాన్, రహీం షేక్, ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, హన్మంత్, వై.సంతోష్, శివరాజ్, నర్సింహులు, ఎం.సంతోష్, అశోక్ బసుదే, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular