ఎల్.బీ.నగర్, మార్చి18 (నేటి దర్శిని): ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. తనను ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. సుజాత నాయక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, ప్రజా ప్రతినిధిగా ఉండి ఎమ్మెల్యే తాను మాట్లాడే తీరు అప్రస్తుతం, తనను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సోమవారం హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. ఆమెకు అనుకూలంగా పలువురు బలమైన మద్దతు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
