ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపీఎం కిసాన్ యాప్ పేరిట ప్రజలకు టోకరా

పీఎం కిసాన్ యాప్ పేరిట ప్రజలకు టోకరా

📰 Generate e-Paper Clip

•  పీఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు

•  బాధితులు కోనరావుపేట, మంగళ్లపల్లివాసులు

హైదరాబాద్ న్యూస్ డెస్క్ (నేటి దర్శిని):
రైతుల వాట్సాప్కు వచ్చిన లంకు కోనరావుపేట (వేములవాడ): వాట్సాపు పీఎం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బలు మాయ మయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటు న్నారు. వారి వివరాల ప్రకారం.. పీఎం కిసాన్ పథ కానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయా లని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాలోంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. దీంతో బాధితులు బుధవారం సం బంధిత బ్యాంకుకు వెళ్లి, విషయాన్ని అధికారులకు తెలిపారు. వారు పరిశీలించి, ఖాతాల్లో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్నారు. ట్రాన్స్ఫర్ అయిన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు అప్పటికే డబ్బులు తీసేసుకున్నారని, తామేమీ చేయలేమని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పేరిట వాట్సాప్కు వస్తున్న యాప్ను ఓపెన్ చేయొద్దని సూచించారు.

RELATED ARTICLES

Most Popular