Spread The Love

ముఖ్య అతిథిగా పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి

గుర్రంపోడు మార్చి10 (నేటిదర్శిని):
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా గ్రామ కమిటీ వారు బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు స్వామి వారి రధోత్సవం అట్టహాసంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు లోనయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,పోచంపల్లి మాజీ సర్పంచ్లు గుత్తా తిరుమల్ రెడ్డి,కాసర్ల ధర్మయ్య,వెన్న భూపాల్ రెడ్డి,సోమ రాములు,గుండెబోయిన సత్యనారాయణ, పూల సత్యనారాయణ, గుండెబోయిన రాములు,పిట్టల గూడెం మాజీ ఉప సర్పంచ్ కుంభం ప్రశాంత్ రెడ్డి,మర్రిపెద్ది పృధ్వీ రెడ్డి,కుంభం యాదయ్య,మర్రిపెద్ది నర్సిరెడ్డి,తేలుకుంట్ల కుర్మాల్ రెడ్డి,తేలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,పూల సైదులు ముదిరాజ్,భరిశెట్టి రాజు, బొడ్డు నర్సి,వెన్న నాగేష్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, రామ్,శ్యాం, వంశీ,మర్రిపెద్ది సత్తి రెడ్డి,తంగేళ్ళ మహేందర్ రెడ్డి,గజ్జల శివారెడ్డి,పోలోజు రమేష్ చారి, గజ్జల నాగార్జున రెడ్డి,వైడిఆర్ బిపిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్,అబ్దుల్ కరీం మరియు పోచంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…