Spread The Love

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన దేవాలయ నిర్వాహకులు, గ్రామస్థులు, యువకులు

నారాయణపేట మార్చి12 (నేటి దర్శిని):
నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామంలోని శ్రీ గజ్జలమ్మదేవి దేవాలయంలో జాతరకు బుధవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి… భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు, యువకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులను మాజీ సర్పంచులు, గ్రామస్థులు, దేవాలయ నిర్వాహకులు శాలువలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంత్, రుద్రారెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్, గోపాల్ గౌడ్, ఎం.సంతోష్, కె.లక్ష్మణ్, చామకూర నగేష్, కృష్ణ, అనిల్, గ్రామపెద్దలు రవిగౌడ్, ఓబన్న, శంకర్, వెంకటప్ప, మోహన్, వీరన్న గౌడ్, నర్సింహులు, రాఘవరెడ్డి, శివాజీ కమిటీ సభ్యులు సాయికుమార్, ఆంజనేయులు, రాజు, గోపి, భీమేష్, కావేష్, అధిక సంఖ్యలో యువకులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.