నేటిదర్శిని వెబ్ డెస్క్ (స్పోర్ట్స్): ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలుత దూకుడుగా ఆడింది. తొలి వికెట్ కోల్పోయే సమయానికి 7.5 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. విల్ యంగ్ ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయగా.. 10వ ఓవర్లో 69 పరుగుల వద్ద కుల్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. అనంతరం కివీస్ ను మరింత కట్టడి చేసిన భారత బౌలర్లు.. మరో ఐదు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మరో వికెట్ తీశారు. 15 ఓవర్ల వద్ద 3 వికెట్ల నష్టానికి కివీస్ 83 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు భారత్ కు 252 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసింది. కివీస్ జట్టు తరపున డారిల్ మిచెల్ అత్యధికంగా 63 పరుగులు చేయగా, మైఖేల్ బ్రేస్‌వెల్ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ (34), మైఖేల్ బ్రేస్‌వెల్‌తో కీలక భాగస్వామ్యాలను పంచుకున్నాడు. రచిన్ రవీంద్ర (37), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11) భారీ ఆరంభాన్ని అందించడంలో విఫలమయ్యారు.ఇక భారత జట్టు తరపున వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, షమీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కివీస్ దూకుడును అడ్డుకున్న భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 252
