గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):
ఖేలో ఇండియా అండర్-13 ఫుట్‌బాల్ విభాగంలో గుర్రంపూడ్ మోడల్ స్కూల్ విద్యార్థిని కురుమళ్ళ అరుణ జ్యోతి, తానేదారిపల్లి గ్రామం (జువ్విగూడెం) నుంచి ఎంపికైంది. సంభదిత సెలక్షన్లు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో నిర్వహించగా, అరుణ జ్యోతి తన ప్రతిభతో స్టేట్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు కింద ₹10,000 నగదు బహుమతి అందుకుంది. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి.రాగిణి మేడం మాట్లాడుతూ, ఇది మా పాఠశాలకి గర్వకారణం అని, అరుణ జ్యోతి సాధించిన విజయంతో విద్యార్థులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి.రాగిణి మేడం, పీడీ జి.సత్యనారాయణ, పీ.దయాల్ ప్రకాష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా ఫుట్‌బాల్ సెలక్షన్స్‌లో మెరిసిన కురుమళ్ళ అరుణ జ్యోతి
