భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డిని కలిసిన గ్రామస్థులు
నారాయణపేట జనవరి12 (నేటిదర్శిని): అప్పిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ అప్పిరెడ్డిపల్లి గ్రామస్తులు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ గ్రామానికి చెందిన మాధవ్, కథలప్పలు నారాయణపేటకు చెందిన నరసింహతో కలిసి రాజ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు ఉన్నారు.