ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నారాయణపేటలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్ల పంపిణీ

నారాయణపేట జనవరి10 (నేటిదర్శిని):నారాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు  భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వెట్టర్లను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి శుక్రవారం నారాయణపేటలో అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్లవారుజామున చలిలో విధులను నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు చలితో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి స్వెట్టర్లను అందజేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు చలిలో విధులను నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, కార్మికులకు స్వెట్టర్లను అందజేయాలని సభ్యుల సూచన మేరకు సుమారు వంద మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్లను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, వెంకటప్ప, నర్సింహులు, సంతోష్, రుద్రారెడ్డి, అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular