మైసమ్మ జాతరలో పాల్గొన్న భీష్మరాజ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు

IMG-20250107-WA0576.jpg

సభ్యులను ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు

దామరగిద్ద జనవరి07 (నేటిదర్శిని):
నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలోని శ్రీ మైసమ్మ దేవాలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న జాతర మహోత్సవాల్లో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు.. ఫౌండేషన్ సభ్యులను శాలువతో సన్మానించారు. ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, వెంకటేష్ మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు సహకారం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు, ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తూ ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పేదలకు సేవ చేయడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎం.సంతోష్, సుదర్శన్ రెడ్డి, వెంకటరావు, మధుసూదన్ రెడ్డి, మోహన్, శరన్ దాస్, శ్రీనివాస్, చామకూర, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ బక్క నర్సప్ప, జోషి, జీకే వెంకటప్ప, బర్ల ఆనంద్, ఈరప్ప, గ్యాంగ్ హనుమంతు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

1 thought on “మైసమ్మ జాతరలో పాల్గొన్న భీష్మరాజ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు

Comments are closed.