నారాయణపేటలో కరాటే విద్యార్థులకు బెల్టుల ప్రధానం

నారాయణపేట జనవరి04 (నేటిదర్శిని): శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. మా కేశవ్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఫౌండర్ వ్యవస్థాపకులు కేశవ్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థిని విద్యార్థులకు శనివారం నారాయణపేట పట్టణంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో బెల్టుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి హాజరై విద్యార్థినీ విద్యార్థులకు బెల్టులను అందజేశారు. అంతకుముందు కరాటే విద్యార్థులు పలు విన్యాసాలు, ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేశవ్ కరాటే అకాడమీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాస్టర్ అశోక్, అనురాధ, మహేశ్వరి, రాకేష్, వైశాలి, ఆరాధ్య, ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, బాలాజీ, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

