ప్రతిఒక్కరిలో దైవచింతనను పెంపొంచాలి రాజ్ కుమార్ రెడ్డి
దామరగిద్ద డిసెంబర్18 (నేటిదర్శిని):
ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి 21వ మహా పడిపూజ కార్యక్రమం భక్తుల జయజయ ద్వానాల మధ్య బుధవారం కన్నుల పండుగ జరిగింది. అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు రాజ్ కుమార్ రెడ్డిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మికను పెరిగేలా చూడాలని కోరారు. అనంతరం వందలాది మంది భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యప్ప పడిపూజ అనంతరం జరిగిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి రాజ్ కుమార్ రెడ్డి రూ.21 వేల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, పూజారులు, ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, బాలాజీ, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.