Spread The Love

నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత

ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

తమ్ముడి భౌతికకాయానికి నివాళులు

పెదనాన్నగా నారా రోహిత్, గిరీశ్ లకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు… హైదరాబాదు చేరుకుని ఏఐజీ ఆసుపత్రిలో తమ్ముడి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మరణించిన సందర్భంలో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుమారులు నారా రోహిత్, నారా గిరీష్‌లను అక్కనే చేరుకుని ఓదార్పు అందించారు. తమ తండ్రిని కోల్పోయిన ఈ సోదరులకు, పెదనాన్నగా ధైర్యం చెప్పారు.

ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు తెలుగుదేశం పార్టీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలాగే, రామ్మూర్తినాయుడు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఆసుపత్రికి వచ్చి గౌరవప్రదమైన నివాళులు అర్పించారు.