ePaper
Friday, September 4, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతాజా సమాచారమ్రెక్కలు విప్పుతున్న రేషన్ బియ్యం దందా..

రెక్కలు విప్పుతున్న రేషన్ బియ్యం దందా..

📰 Generate e-Paper Clip

మిడ్జిల్,సెప్టెంబర్ 21, (నేటి దర్శినిప్రతినిధి): మిడ్జిల్ మండలంలో జోరుగా అక్రమ బియ్యం దందా..! అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు! మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యంగా మారింది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని మల్లాపురం, గుడిగనిపల్లి, గ్రామంలోపల బియ్యం నిల్వ పెట్టుకొని ఆటోలు, మినీ వ్యాన్లు, బొలేరో వాహనాల్లో నింపి, కల్వకుర్తి వివిధ మండలాలకు వివిధ షాప్ లోకి తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ దందా పై పోలీసు,రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు జారీ చేసి వారికి అసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది.పేదల ఆకలి తీర్చాలనే ఆశయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.సివిల్ సైప్లై శాఖలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నదని పలువురు భావిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ రేషన్ బియ్యం అక్రమ దందాను ఆ మండలంలో అధిదారులు కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అధికారులకు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ బియ్యం దందాను మండలంలో కింగ్ లా రాజ్యమేలుతున్న తతంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular