పేదలకు చేయూతనిచ్చేందుకు కృషి: రాజ్ కుమార్ రెడ్డి
- అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.10వేల చెక్కు అందజేత
నారాయణపేట, సెప్టెంబర్22 (నేటి దర్శిని):ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ ఎల్లవేళలా కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణానికి చెందిన సానియాబేగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయాన్ని రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేల చెక్కును సోమవారం నారాయణపేటలో అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేని ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. దీంతోపాటు విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించేందుకు తమ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డికి సమస్య వివరించిన వెంటనే రూ.10వేలను అందజేయడం సంతోషంగా ఉందని బాధితురాలు తెలిపారు. భవిష్యత్తులో పేదలకు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలందించాలని కోరారు. రాజ్ కుమార్ రెడ్డి వెంట విద్యార్థి నాయకులు ఫయాజ్ ఖురేషి, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన రెడ్డి, గోపాల్ గౌడ్, నర్సింహనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంతోష్, రాజప్ప గౌడ్, అశోక్ బసుదే, జేకే అనిల్, రాజు ఉన్నారు.
