Reservation: లీకైన రిజర్వేషన్లు… నాయకులలో మొదలైన బుగులు…
- రిజర్వేషన్లను చూసి బోరుమన్న రాజకీయ నాయకులు… అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి..
- గుర్రంపోడు మండలంలో ఉసురుమంటున్న అగ్ర నాయకులు…
- ఇన్నేళ్లుగా ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిద పాలు అయ్యేనా…
- సావు పుట్టుకలకు ఆపద సమయాలకు చేసిన దానాలు నేలపాలయ్యేనా…
- ఆశావాహులలో అత్యుత్సాహం అనధికారిక ప్రకటనలతో ప్రజలు ఆగమాగం….
గుర్రంపోడు,(నేటిదర్శిని):గుర్రంపోడు మండలంలో స్థానిక ఎలక్షన్ ల విషయంలో, యువత ఉత్సాహం అంతాఇంతా కాదనే చెప్పుకోవాలి..!? తలపండిన రాజకీయ నాయకుల నుంచి, ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నాయకుల వరకు, స్థానిక ఎన్నికల పైనే గురిపెట్టి ఉ న్నారు..!? ఎప్పుడెప్పుడా అంటూ, నెలలు నెలలు గడుస్తున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను, జారీ చేసిందంటూ, పలానా ఊరికి పలానా రిజర్వేషన్ వచ్చిందంటూ పుకార్లు పుట్టాయి..!? మండల అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదని, అధికారికంగా మేము ప్రకటించలేదని చెప్పుకొచ్చారు..!? మంటరానీ పొగతో ఇప్పటికే కండ్లు మంటలేస్తున్న నాయకులకు, ఈ పుకారు జాబితా కండ్లల్లో పసరు పోసినట్లయిందనే చెప్పాలి..!? ఈ జాబితా వల్ల, కొన్ని గ్రామాల నాయకులలో ఉత్సాహం, మరికొన్ని గ్రామాల నాయకులలో ఆవేదనలు ఎక్కువయ్యాయి..!? ఊరికి చేసిన సేవ, పీనుగకు చేసిన అలంకారం ఒక్కటే అంటూ అలిగి కూర్చున్నారు యువ నాయకులు..!? మరికొందరేమో మందుంది భవిష్యత్తు భయమెందుకు అంటూ ప్రజా సేవలో మునిగిపోయారు..!? దాదాపు గుర్రంపోడు మండలంలోని అన్ని గ్రామాల రిజర్వేషన్ లు, అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు..!? ఆనందంతో కొందరు, బాధతో మరికొందరు వైన్స్ భాటపట్టారు..!? పుకార్లు కొడుతున్న రిజర్వేషన్ లను మార్చాలని, కొంతమంది పైరవిలు మొదలు పెట్టారని కూడా సమాచారం..!? ఏదేమైనా రహస్యంగా ఉండాల్సిన రిజర్వేషన్ ల జాబితా, అనధికారికంగా ఎలా బయటికి వెళ్లిందని, మండల అధికారులపై గుర్రుమంటున్నారు మండల ప్రజలు..!? అదిగో పులి, ఇదిగో తోక అనే మాదిరిగా తయారైన ఈ రిజర్వేషన్ ల జాబితాతో, మండల కేంద్రంలో లీడర్ల జోరు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది..!? రిజర్వేషన్ జాబితాను, అనధికారికంగా ప్రచారం చేసిన మండల అధికారులపై, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, రాజకీయ విశ్లేషకులు ఉ న్నత అధికారులను కోరుతున్నారు..!?
