పేటలో ఘనంగా భగవాన్ బలరామ జయంతి

IMG-20250829-WA0053.jpg

నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని):
భగవాన్ బలరామ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడే భగవాన్ బలరాముడు రైతుల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని కోరారు. అంతకుముందు వారిని నిర్వాహకులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ పట్టణ అధ్యక్షులు ఆకుల వెంకటప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకోబా, జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ప్రభు మిస్కిన్, ఉపాధ్యక్షులు శరణయ్య, బాలప్ప, విశ్వనాథ్ రెడ్డి, రంగారెడ్డి, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, శివరాజ్, కృష్ణయాదవ్, నాగురావు, అశోక్, చామకూర నగేష్, నర్సింహ, రాజప్ప గౌడ్, అధిక సంఖ్యలో రైతులు, కిసాన్ సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.