Spread The Love

నారాయణపేట ఏప్రిల్14 (నేటి దర్శిని):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.

దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇప్పిస్తా: రాజ్ కుమార్ రెడ్డి

తనకు తల్లిదండ్రులు ఎవరు లేరని, దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్‌ను ఇప్పించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డిని అంబేద్కర్ విగ్రహం వద్ద కలిసి విజ్ఞప్తి చేశాడు. దివ్యాంగుడి సమస్యలను తెలుసుకున్న రాజ్ కుమార్ రెడ్డి అతనికి ట్రై సైకిల్ ను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని  హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, రుద్రారెడ్డి, గోపాల్ గౌడ్, శివరాజ్, ఎం.సంతోష్, అశోక్, గోపాల్, నర్సింహనాయుడు, ఎ.నర్సింహులు, లక్ష్మీకాంత్, నందుకుమార్, చామకూర నగేష్, నిర్వాహకులు పాల్గొన్నారు.