Spread The Love

2000-2001 పదవ తరగతి విద్యార్థులు 60 మంది ఒకేచోట

ఘనంగా ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు

24 ఏండ్ల తర్వాత కలిసిన మొత్తం విద్యార్థులు

చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు

నేటి సమాజంలో గుర్తింపు, గౌరవము ఉపాధ్యా యులవలనే వచ్చిందన్న పూర్వ విద్యార్థులు

కొండమల్లెపల్లి మార్చి02 (నేటి దర్శిని):
నల్గొండ జిల్లా కొండ మల్లేపలి సిద్ధార్ధ హైస్కూల్   లో 2000-01 సంవత్సరము పదవ తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యా ర్థులు ఆదివారం స్థానిక కొండమల్లేపల్లి పట్టణంలోని కె ఆర్ కె కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అప్పుడు వారికి విద్యను బోధించిన ఉపాధ్యాయులను శాలువాలు, గిఫ్ట్స్, మెమెంటులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రస్తుతం వారు సమాజంలో చేస్తున్న సేవలను, పనులను ఒకరికొకరు తెలియపరుచుకున్నారు. ఆరోజు వారికి ఉపాద్యాయూలు చేసిన బోధనతోనే మేము సమాజంలో ఈరోజు ఇంత మంచి స్థానాలలో ఉన్నామని గుర్తుచేసుకుని ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. 24 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే స్టేజి మీద కలుసుకోవడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనాడు విద్యఅందించిన ఉపాధ్యా యులు ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, చంద్రమౌళి, చక్రధర్, రామకృష్ణ, యాదయ్య, అంజనేలు, సులేమాన్, శ్రీను, వెంకటబాబు తో పాటు పూర్వ విద్యార్థులు జనార్దన్, రాములు, దస్రు, పోలశ్రీను, యేకుల సురేష్, ముచ్చర్ల శ్రీను, వీరబోన రామాంజనేయులు ,నాయిని అనిల్ ,సైదిరెడ్డి,బత్తుల జంగయ్య,రాజేశ్వర్ రెడ్డి,జగన్ , వింజమూరి రాజు, రఘు , జీవన్ రెడ్డి , రూపేందర్ , ప్రేమసుందర్ సపిడి శ్రీను,అరెడ్ల స్వాతి, మణిపాల్ రెడ్డి ,విజయలక్ష్మి, మోర శ్రీనుహరి , రవి , సుధాకర్,షమీమ్ ,పురుషోతము ,స్వప్న, రవివర్ధన్ , శోభా, ఆంబోతు రవి , మంగులాల్, అంజి, గీత,అనిత ,శిల్ప , శ్రీలత , శ్రీనివాస్ యాదవ్ , షాహినీ, వెంకట్ రెడ్డి , అక్రమ్, రాజు నాయక్ , సందీప్ రెడ్డి గోవర్ధన్ ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.