Spread The Love

ప్రతియేడు వందలాది మంది స్వాములకు నిత్య అల్పాహారం

ఎల్.బి.నగర్ డిసెంబర్09 (నేటిదర్శని): మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు, భవాని, ఆంజనేయ స్వాములకు మండల కాలం పాటు నిత్య అల్పాహారాన్ని ఎస్వీ గ్రూప్ బిల్డర్స్ డెవలర్స్ ఆధ్వర్యంలో చంపాపేటలో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వందలాది మంది స్వాములకు నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పుల్లూరి ఉపేందర్ గుప్త గురుస్వామి మాట్లాడుతూ పొద్దంత కష్టపడి వచ్చి పూజలు చేసుకుని వంట చేసుకోలేని స్వాముల కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతియేడు స్వాములకు నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిత్య అల్పాహారం ఏర్పాటుకు సహకారం అందించిన వారికి నిర్వాహకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గొల్ల గోపాల్ యాదవ్ గురుస్వామి, అనంతకృష్ణ, ఎర్రం శ్రీనివాస్, స్వాములు శేరి శ్రీకాంత్ గుప్త, మాల్యాద్రి, రవికుమార్ యాదవ్, బీరప్ప, మనోహర్, సుధీర్, శరత్ చంద్ర, అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.