Spread The Love

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో అరగంట సమస్యలు చర్చించి సన్మానించిన మధుయాష్కి గౌడ్

దివ్యాంగులను సన్మానిస్తున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్ డిసెంబర్ 3 (నేటిదర్శిని): దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మధుయాష్కి గౌడ్ నివాసంలో మంగళవారం రోజు పలువురు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులను శాలువతో ఘనంగా సన్మానించి పూల బోకే అందజేసి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ… దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని అన్ని సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో మంత్రి సీతక్కను, సీఎం రేవంత్ రెడ్డి తో దివ్యాంగుల సమస్యలు చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. దివ్యాంగులు వైకల్యంతో అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటానని మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ లోని ఆరు వసతి గృహాల విద్యార్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చంపాపేటకు చెందిన దివ్యాంగుల సంఘం ప్రతినిధులు ఓయూ పరిశోధన విద్యార్థి సంఘం పూల నాగరాజు, వంశరాజ్ రామచంద్ర, రాతికింది అంజి గౌడ్, గోగుల రమేష్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.